Uddhav Thackeray: గోవులను కాపాడి.. మహిళలను వదిలేస్తున్నారు.. సిగ్గుండాలి!: బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడిన శివసేన

  • మహిళలకు రక్షణ లేని దేశంగా భారత్
  • మిత్రులైనా తప్పు చేస్తే నిలదీస్తా
  • ఎవరు జాతీయవాదులో వారెలా చెబుతారు?

మోదీ సర్కారుపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోమారు ఫైరయ్యారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. గోవులకు ఇస్తున్నపాటి రక్షణ వారికి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలకు రక్షణ లేని దేశంగా భారత్ మారిపోయిందన్నారు. ఇందుకు సిగ్గుపడాలన్నారు.

ప్రభుత్వంలో తాము భాగస్వాములమైనంత మాత్రాన తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోబోమని ఉద్ధవ్ తేల్చి చెప్పారు. తాము భారత జనతాకే మిత్రులం కానీ, భారతీయ జనతా పార్టీకి కాదని తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్న హిందూత్వం అంతా బూటకమని కొట్టి పడేశారు. ఎవరు జాతీయవాదులో, ఎవరు కాదో తేల్చడానికి బీజేపీ ఎవరని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జాతి వ్యతిరేకులు అయిపోరన్న థాకరే.. ప్రభుత్వం తప్పటడుగులు వేస్తే నిలదీస్తానని స్పష్టం చేశారు. బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకుని యూపీఏను ఓడించి, బీజేపీకి పట్టం కడితే అది కూడా మునుపటి పార్టీలానే వ్యవహరిస్తోందని విమర్శించారు. తాము సామాన్యుడి కల నెరవేర్చేందుకు పోరాడుతున్నాం తప్పితే, మోదీ కలను నెరవేర్చేందుకు కాదని కుండబద్దలు కొట్టారు.

More Telugu News