Mahesh Babu: తమిళంలో 'అనిరుధ్'గా మహేశ్ బాబు సినిమా!

  • శ్రీకాంత్ అడ్డాల నుంచి వచ్చిన 'బ్రహ్మోత్సవం'
  • తమిళ ప్రేక్షకుల ముందుకు 'అనిరుధ్'గా 
  • ఆగస్టు 3వ తేదీన తమిళనాట విడుదల  

మహేశ్ బాబు కెరియర్లో కనిపించే భారీ బడ్జెట్ చిత్రాలలో 'బ్రహ్మోత్సవం' ఒకటిగా కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన కాజల్ .. సమంత .. ప్రణీత కథానాయికలుగా నటించారు. భారీ తారాగణం కనువిందు చేసినా .. కథాకథనాల పరంగా ఈ సినిమా పేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా మహేశ్ బాబుకి ఇటీవల తమిళనాట పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, 'బ్రహ్మోత్సవం' సినిమాను అక్కడ 'అనిరుధ్' అనే పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మిక్కీ. జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తమిళనాట భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.      

More Telugu News