సాధారణ రైలు టికెట్ల కోసం యాప్... 8 రోజుల్లో మిలియన్ డౌన్ లోడ్లు!
- 'యూటీఎస్ ఆన్ మొబైల్' యాప్ కు పెద్ద ఎత్తున స్పందన
- నగదుతో రీచార్జ్ చేసుకున్న 50 వేల మంది
- రైల్వే కౌంటర్లలో నిలబడాల్సిన అవసరం లేదు
కౌంటర్ లోని భారీ క్యూలో నిలబడి, రైలు బయలుదేరే లోగా, టికెట్ తీసుకోగలమా? అనే టెన్షన్ తో ఉండే ప్రయాణికులు ఈ యాప్ ద్వారా సులువుగా టికెట్ బుక్ చేసుకుంటున్నారు. అయితే, టికెట్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా కలుగక పోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తోందని ప్రయాణికులు అంటున్నారు.
ఈ యాప్ రైల్వే స్టేషన్ కు 5 కిలోమీటర్ల పరిధిలోనే పనిచేస్తుండటంతో కాస్త ఇబ్బందిగా ఉందని, ప్రయాణం చేయాల్సిన రోజు మాత్రమే టికెట్ లు బుక్ చేసుకునే నిబంధనను కూడా మార్చాలని కోరుతున్నారు.