Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మళ్లీ ప్రభుదేవాతో జోడీకడుతున్న తమన్నా 
  • బాలీవుడ్ సినిమాలో అమలాపాల్ 
  • సుశాంత్ సినిమా వచ్చే నెలకి వాయిదా

*  ఆమధ్య 'అభినేత్రి' సినిమాలో జంటగా నటించిన ప్రభుదేవా, తమన్నా కలసి మళ్లీ మరో సినిమా చేయనున్నారు. ప్రముఖ నటుడు పార్తీపన్ దర్శకత్వం వహించే సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని పార్తీపన్ చెబుతూ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు.
*  దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటించనుంది. అర్జున్ రాం పాల్ హీరోగా నటించే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తుంది. అక్టోబర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  యువ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా రూపొందిన 'చి.ల.సౌ' చిత్రం విడుదల వాయిదా పడింది.ఈ నెల 27న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు.

More Telugu News