పేరూరు డ్యాం నిర్మాణ పనుల్లో కూలీగా మంత్రి పరిటాల సునీత!
- పైలాన్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు
- పర్యవేక్షణకు వెళ్లి పనులు చేసిన సునీత
- కూలీలతో కలిసి తట్ట మోసిన మంత్రి
డ్యాం కాలువ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పైలాన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన మంత్రి సునీత అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. కూలీలా తలకు బట్ట చుట్టుకుని తట్టతో ఇసుక, సిమెంట్ అందించారు. మంత్రి స్వయంగా పనులు చేయడంతో కూలీలు మరింత ఉత్సాహంగా పనిచేశారు.