Facebook: సొంత శాటిలైట్ ను ప్రయోగించనున్న ఫేస్ బుక్

  • డిసెంబర్ 2019లోగా ప్రయోగం
  • మారుమూల ప్రాంతాలకు బ్రాడ్ బ్యాండ్ కోసమే
  • పాయింట్ వ్యూ టెక్ ఎల్ఎల్సీ పేరిట దరఖాస్తు

ఇప్పటికీ ఆన్ లైన్ సేవలకు దూరంగా ఉన్న కోట్లాది మంది ప్రజలతో అనుసంధానమయ్యేలా ఫేస్ బుక్ సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. సొంత శాటిలైట్ ను 'ఎథేనా' పేరిట తయారు చేస్తున్న ఫేస్ బుక్ వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వద్ద ఇప్పటికే 'పాయింట్ వ్యూ టెక్ ఎల్ఎల్సీ' పేరిట దరఖాస్తు చేసిన ఫేస్ బుక్ శాటిటైల్ డిజైన్ ను కూడా అందించింది.

ఇంటర్నెట్ కు దూరంగా ఉన్న ప్రాంతాలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాన్ని దగ్గర చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని సంస్థ అధికారులు వెల్లడించారు. దీనిపై ప్రస్తుతానికి ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదని, తదుపరి తరం బ్రాడ్ బ్యాండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు శాటిలైట్ సాంకేతికత అత్యంత కీలకమని అన్నారు. కాగా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ సహకారంతో వన్‌ వెబ్‌ కూడా ఇదే తరహా ప్రాజెక్టులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News