2 లక్షల క్యూసెక్కులు దాటిన జూరాల వరద... శరవేగంగా నిండుతున్న శ్రీశైలం!
- పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
- 50 టీఎంసీలను దాటిన నీటి నిల్వ
- ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద
ఈ మొత్తం నీటిని విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా నదిలోకి వదులుతుండటంతో, ఆ నీరంతా శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. మొత్తం 885 అడుగుల మేరకు నీటి నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో నిన్న రాత్రి 10 గంటల సమయానికి ప్రస్తుతం 829.20 అడుగులకు నీరు చేరింది. ఈ వరద మరిన్ని రోజులు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తుంగభద్ర జలాశయంతో పాటు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు.