bellamkonda srinivas: 'సాక్ష్యం' కోసం శ్రీవాస్ ఎంతో కష్టపడ్డారు: బెల్లంకొండ శ్రీనివాస్

  • శ్రీవాస్ ఎంతో హోమ్ వర్క్ చేసేవారు 
  • పీటర్ హెయిన్స్ చాలా కష్టపడ్డారు 
  • వాళ్లిద్దరూ పడిన కష్టమే ఈ సినిమా  
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. పూజా హెగ్డే కథానాయికగా దర్శకుడు శ్రీవాస్ 'సాక్ష్యం' సినిమాను రూపొందించాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఈ సినిమా గురించిన విషయాలను పంచుకున్నారు.

"160 వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. మరుసటి రోజు షూటింగ్ అంటే ఆయన నిద్రపోయేవారు కాదు .. మరుసటి రోజు చేయవలసిన సీన్స్ కి సంబంధించిన హోమ్ వర్క్ చేస్తూ కూర్చునేవారు. షూటింగ్ పూర్తయ్యాక ప్రతిరోజు పొద్దున్నే స్కూల్ బాయ్ లాగా ఎడిట్ సూట్ కి వెళ్లేవారు .. ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే ఉండేవారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ సమయంలో పీటర్ హెయిన్స్ కూడా అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లిద్దరి కష్టమే ఈ సినిమా" అన్నాడు.   
bellamkonda srinivas
pooja hrgde

More Telugu News