Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతాను ఆయనే నిర్వహిస్తున్నారా?: పంచుమర్తి అనురాధ

షార్ట్స్‌లో చూడండి
సీఎం చంద్రబాబుపై అనవసర విమర్శలు చేసే పవన్ కల్యాణ్, కేంద్రం చేసిన అన్యాయంపై ఎందుకు స్పందించరని ఏపీ టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కనీస అవగాహన లేని పవన్ కల్యాణ్ తనకు తోచినట్టుగా ట్వీట్లు చేయడం సబబు కాదని, చంద్రబాబుపై అనవసర విమర్శలు చేసిన ఆయన రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయారని, పవన్ తన చేష్టలతో తన స్థాయిని దిగజార్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసలు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతాను ఆయనే నిర్వహిస్తున్నారా? లేక ఢిల్లీలోని బీజేపీ ఆఫీసు నడిపిస్తోందా? అని ఆమె దుయ్యబట్టారు. ప్రజలను పణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలను ఏ విధంగా పొందాలో పవన్ కు, ఆయన అన్నయ్యకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని సెటైర్ వేశారు. చార్జీ షీట్లలో పేర్లున్న వ్యక్తులు జనసేన పార్టీలో ఉన్నారని, ఇటువంటి వ్యక్తులను తన పార్టీలో ఉంచుకున్న పవన్ కు దేశభక్తి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
Go Back to Shorts
Pawan Kalyan
panchumarthi

More Telugu News