Chandrababu: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఈ ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు నేతలతో ఆయన భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. లోక్ సభలో అవిశ్వాసం, తదనంతర పరిణామాలపై జాతీయ మీడియాతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సమావేశంలో ఎండగట్టనున్నారు.
Go Back to Shorts
Chandrababu
delhi

More Telugu News