సింగపూర్‌పై అతిపెద్ద సైబర్ దాడి.. ప్రధాని సహా 1.5 మిలియన్ల మంది డేటాబేస్ చోరీ!

సింగపూర్‌పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సీన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా బేస్ చోరీకి గురైంది. ఈ విషయాన్ని  ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన భద్రత కలిగిన దేశంపై దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

డేటా చోరీపై సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఓ ప్రణాళిక ప్రకారం డేటాను తస్కరించారని ప్రభుత్వం తెలిపింది. ఇది సాధారణ హ్యాకర్ల పనో, క్రిమినల్ గ్యాంగ్ పనో కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2015 నుంచి ఈ ఏడాది జూలై వరకు ఆసుపత్రులను సందర్శించిన 1.5 మిలియన్ల మందికి చెందిన డేటాను హ్యాకర్లు చోరీ చేశారు.
Go Back to Shorts
Cyberattack
Singapore
database
health

More Telugu News