modi: అవిశ్వాసంపై చర్చ చేపడితే భూకంపం వస్తుందన్నారే... ఏదీ భూకంపం?: ప్రధాని మోదీ

  • సంపూర్ణ అధిక్యంతో వచ్చిన ప్రభుత్వం మాది
  • ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగ్య విధాతలు
  • మాపై విశ్వాసం పెంచేందుకు ఉపయోగపడే సందర్భం ఇది

అవిశ్వాస తీర్మానం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించిన గొప్ప అవకాశం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ‘30 ఏళ్ల తర్వాత సంపూర్ణ అధిక్యంతో వచ్చిన ప్రభుత్వానికి విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడే సందర్భం ఇది. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు తెచ్చారనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది.

అవిశ్వాసంపై చర్చ చేపడితే భూకంపం వస్తుందని అన్నారు. ఏదీ భూకంపం? అహంకార పూరిత ధోరణే వారిని ఈ దిశగా పురిగొల్పింది. ప్రధాని కుర్చీలో ఎప్పుడు కూర్చుందామనేది వారి ఆరాటం. 2019లో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగ్య విధాతలు..’ అని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ నేతలు అడ్డుతగిలారు. దీంతో, స్పీకర్ కలగజేసుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, టీడీపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు.

More Telugu News