గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం.. రికార్డుల నుంచి తొలగించాలంటూ డిమాండ్
- రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందన్న గల్లా
- లోక్ సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిందన్న జితేందర్ రెడ్డి
- కాంగ్రెస్, బీజేపీలను ఒప్పించి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఎంపీ
తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని... ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని... తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.