Pakistan: పాక్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయిన నవాజ్ షరీఫ్!

  • కూతురు మరియం, అల్లుడుకి ఓటేసే అవకాశం లేదు
  • ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ముగిసింది 
  • పాక్ ఎన్నికల సంఘం ప్రతినిధి నదీమ్ వెల్లడి

ఈ నెల 25న పాకిస్థాన్ లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం, అల్లుడు సఫ్దార్ కోల్పోయారు. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, మరియంలు రావల్పిండిలో జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

 ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ఈ నెల 5తో ముగిసిపోవడంతో వీరికి ఓటు వేసే అవకాశం లేకుండా పోయినట్టు పాక్ ఎన్నికల సంఘం ప్రతినిధి నదీమ్ ఖాసీం పేర్కొన్నారు. అవెన్ ఫీల్డ్ కేసులో వీరికి ఈ నెల 6న శిక్ష పడిందని, జులై 5 నాటికే ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ముగిసిందని, దీంతో, ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని వారు కోల్పోయారని అన్నారు. ఈ విషయమై పునరాలోచించేందుకు ఏమీ లేదని, ఎన్నికల సంఘం కూడా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.

More Telugu News