jc diwakar reddy: జేసీతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు..రేపు ఢిల్లీ వెళ్తున్నానన్న ఎంపీ

షార్ట్స్‌లో చూడండి
‘అవిశ్వాసం’పై రేపు లోక్ సభలో జరిగే చర్చకు తాను పాల్గొనని భీష్మించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ఫోన్ చేశారు. ‘అవిశ్వాసం’పై జరిగే ఓటింగ్ లో పాల్గొనాలని జేసీకి చంద్రబాబు సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మిగిలిన అంశాలపై చర్చిద్దామని జేసీతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు చేసిన సూచనకు జేసీ అంగీకరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో తాను పాల్గొంటానని, రేపు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. తాను ఎవరినీ బెదరించలేదని, తన వల్ల పార్టీకి మచ్చ రావడం ఇష్టం లేదని అన్నారు. ‘అవిశ్వాసం’పై రేపటి ఓటింగ్ లో పాల్గొంటానని, ఓటింగ్ అనంతరం, తన ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయం చెబుతానని అన్నారు.
Go Back to Shorts
jc diwakar reddy
Telugudesam

More Telugu News