దిల్ రాజు నిర్మాతగా వచ్చేస్తోన్న వరుస సినిమాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు నిర్మాతగా వచ్చేస్తోన్న వరుస సినిమాలు

  • ఆగస్టు 9న 'శ్రీనివాస కళ్యాణం'
  • అక్టోబర్ 18న 'హలో గురు ప్రేమకోసమే'
  • జనవరి 12వ తేదీన 'ఎఫ్ 2' 
  • ఏప్రిల్ 5న మహేశ్ 25వ మూవీ  
నిర్మాతగా దిల్ రాజుకు మంచి అనుభవం వుంది. యూత్ కు .. మాస్ కు .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన కథలేమిటో ఆయనకి బాగా తెలుసు. అలా ఆయా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం వల్లనే ఆయన ఖాతాలో విజయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా ముందుగానే విడుదల తేదీలను ప్రకటిస్తూ వుంటారంటే, ఆయన ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ నుంచి రేపు 'లవర్' సినిమా రానుంది. ఆ తరువాత సినిమాగా ఆగస్టు 9వ తేదీన 'శ్రీనివాస కళ్యాణం'ను విడుదల చేయనున్నారు. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. ఇక రామ్ . . అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమాను అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నారు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న 'ఎఫ్ 2' ను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీన వంశీ పైడిపల్లి - మహేశ్ బాబు మూవీని విడుదల చేయనున్నారు.    
dil raju

More Telugu News