chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు'కి షూటింగ్ పూర్తిచేసిన రమ్యకృష్ణ

  • షూటింగు దశలో 'శైలజా రెడ్డి అల్లుడు' 
  • నా అభిమాన నటి రమ్యకృష్ణ 
  • ఆమె నటన అద్భుతం అంటున్నమారుతి 

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'శైలజా రెడ్డి'గా రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. రమ్యకృష్ణతో కలిసి దిగిన ఒక సెల్ఫీని మారుతి పోస్ట్ చేశాడు. రమ్యకృష్ణ తన అభిమాన నటి అనీ .. ఆమె నటన అద్భుతమంటూ అభినందించాడు.

ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. చైతూ పాత్ర వైపు నుంచి చూస్తే ఆమె శ్రీమంతురాలు .. అహంభావం కలిగిన అత్తగారు పాత్రలో అదరగొట్టేయనున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను వాణిశ్రీ ఎక్కువగా పోషించేవారు. అలాంటి పాత్రలో రమ్యకృష్ణ చేస్తుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక నుంచి ఈ తరహా పాత్రలకి ముందుగా రమ్యకృష్ణ పేరు గుర్తుకు వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.    

More Telugu News