నాలుగు రోజుల క్రితమే భవనంలోకి.. అంతలోనే కుప్పకూలిన బిల్డింగ్.. కుటుంబం ఆచూకీ గల్లంతు!
- శనివారం రాత్రి కుప్పకూలిన భవనం
- ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికితీత
- కనిపించని త్రివేదీ కుటుంబం ఆచూకీ
కొత్తగా నిర్మిస్తున్నఆ భవనంలోని నాలుగో అంతస్తులో త్రివేదీ కుటుంబం ఉండేదని పోలీసులు వివరించారు. భవనం కూలిన తర్వాత నుంచి వారి ఆచూకీ లేదని, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నేటితో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని మీరట్ జోన్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఎంబీఏ పూర్తి చేసిన త్రివేదీ నోయిడాలోని ఓ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్ అని, తాజాగా కూలిన భవనం నిర్మాణ పనుల కోసం ఏప్రిల్‌లోనే ఒప్పందం పూర్తి చేసుకున్నారని తెలిపారు. జూలై 14న భవనంలోకి వచ్చినట్టు పోలీసులు వివరించారు. అంతలోనే భవనం కూలిందని పేర్కొన్నారు.