New Delhi: శారీరక సంబంధాన్ని నిరాకరించే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుంది!: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

  • శృంగారానికి భార్య ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన పనిలేదు
  • అత్యాచారానికి నిర్వచనం మారిపోయింది 
  • ఆర్థికపరమైన ఒత్తిడి ద్వారానూ ఆమెను ఒప్పించవచ్చు

భార్యాభర్తల శృంగారం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామిపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శారీరక సంబంధాన్ని నిరాకరించే హక్కు దంపతులిద్దరికీ ఉంటుందని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భర్త ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతో ఉన్నట్టు మాత్రమే భర్త నిర్ధారించుకోవాలని తెలిపింది.

భాగస్వామిపై అత్యాచారం కేసుల్లో బలప్రయోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ‘మెన్ వెల్ఫేర్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన వాదనతో కోర్టు విభేదించింది. ప్రస్తుతం అత్యాచారం నిర్వచనం పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. బలప్రయోగం ద్వారా మాత్రమే అత్యాచారానికి పాల్పడాల్సిన పనిలేదని, ఇంటి ఖర్చులకు, పిల్లలకు డబ్బులు ఇవ్వబోనని బెదిరించడం ద్వారా కూడా ఆ పనికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.

More Telugu News