ramaprabha: అప్పట్లో నేను చాలా సన్నిహితంగా వున్నది వాళ్లతోనే!: రమాప్రభ

  • పద్మనాభం అంటే గురుభావం 
  • ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చారు
  • చాలామందితో చనువుగా ఉండేదానిని    

అనేక నాటకాలు వేసిన రమాప్రభ .. ముందుగా తమిళ సినిమాల్లోను .. ఆ తరువాత తెలుగు సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చారు. వివిధ భాషల్లో కలుపుకుని ఆమె 1400 సినిమాలకి పైగా చేశారు. అలాంటి రమాప్రభ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

"అప్పట్లో తెలుగు ఇండ్రస్ట్రీలోని వాళ్లందరితో నాకు మంచి సంబంధాలు వున్నాయి. వాళ్లలో కొంతమందితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎస్వీ రంగారావు .. నాగభూషణం .. రాజబాబుతో చనువుగా వుండేదానిని. ఇక పద్మనాభం అంటే గురుభావం వుంది .. నాకు తెలుగు రాకపోయినా 50 .. 60 సినిమాలు ఆయనతో కలిసి చేయడానికి ఒప్పుకున్నారు .. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఇక సావిత్రి .. భానుమతి .. జమున .. గీతాంజలి .. దేవిక .. జి.వరలక్ష్మితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News