whatsapp: వాట్స్ యాప్ తో ప్రయోజనాలూ ఉన్నాయి... మెసేజ్ వైరల్ చేశారు... తప్పిపోయిన బిడ్డ దొరికాడు!

  • కల్వకుర్తిలో తప్పిపోయిన బాలుడు
  • వాట్స్ యాప్ గ్రూపుల్లో వైరల్ చేసిన పోలీసులు
  • పక్క గ్రామంలో దొరికిన బాలుడు

ఇటీవలి కాలంలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న వాళ్లు వచ్చేశారంటూ, వాట్స్ యాప్ లో వైరల్ అవుతున్న మెసేజ్ లు ఎందరి ప్రాణాలనో తీసిన సంఘటనలు చూశాము. దీంతో వాట్స్ యాప్ గ్రూపులతో జరుగుతున్న నష్టంపై పోలీసులు దృష్టి సారించారు కూడా. ఇదే సమయంలో సరిగ్గా వినియోగించుకుంటే, వాట్స్ యాప్ గ్రూప్ ల ద్వారా వైరల్ అయ్యే మెసేజ్ ల వల్ల ప్రయోజనాలు కూయడ ఉంటాయని నిరూపించిందీ ఘటన.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ సమీపంలోని కల్వకుర్తి పట్టణంలో వినయ్ అనే బాలుడు తప్పిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వనపర్తి ఎస్ఐకి విషయం తెలిసింది. ఆయన తన వాట్స్ యాప్ గ్రూప్ లో బాలుడి ఫొటోను పెట్టి, తప్పిపోయాడని చెప్పడంతో, పలువురు దాన్ని తమ మిత్రులు, బంధువులతో పంచుకున్నారు. సమీపంలోని మార్చాల గ్రామంలో ఒంటరిగా ఉన్న బాలుడిని చూసిన కొందరు, వాట్స్ యాప్ లో ఉన్నది అతనేనని గుర్తించి, తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసులు అతన్ని జాగ్రత్తగా కల్వకుర్తికి చేర్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

More Telugu News