Padmaavat: వసూళ్లలో ‘పద్మావతి’ని దాటేసిన ‘సంజు’!

  • అత్యధిక గ్రాస్ సాధించిన ఐదో చిత్రంగా రికార్డు
  • ఆదివారం వరకు రూ.316 కోట్లు వసూలు
  • రణబీర్ 11 ఏళ్ల కెరియర్‌లో ఇదే బెస్ట్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ రికార్డులు కొల్లగొడుతోంది. రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. ఆదివారం రూ.9.29 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ.316.64 కోట్లతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ‘పద్మావతి’ని వెనక్కి నెట్టేసింది. అంతేకాదు, రణ్‌బీర్ కపూర్ 11 ఏళ్ల కెరియర్‌లో రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగానూ ‘సంజు’ రికార్డులకెక్కింది.

More Telugu News