kanna: కన్నా రౌడీయిజం గుంటూరు ప్రజలందరికీ తెలుసు: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కేంద్ర మంత్రులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకాలేదని, చంద్రబాబు సీఎం అయ్యాక రాయలసీమలో ఫ్యాక్షన్, బెజవాడలో రౌడీయిజం బాగా తగ్గాయని అన్నారు. కన్నా రౌడీయిజం గురించి ప్రజలందరికీ తెలుసని, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కన్నా ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా అడిగితే దాడులు చేసే నైజం బీజేపీదని, కన్నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని అన్నారు.
Go Back to Shorts
kanna
buddha venkanna

More Telugu News