crocodiles: 300 మొసళ్లను ఊచకోత కోసిన గ్రామస్తులు!

  • జనావాస ప్రాంతం మధ్యలో మొసళ్ల ఎన్ క్లోజర్
  • అందులో పడ్డ గ్రామస్థుడిని చంపిన మొసలి
  • కోపంతో వందలాది మొసళ్లను చంపేసిన గ్రామస్తులు

తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో... ఏకంగా 300 మొసళ్లను చంపేసిన ఘటన ఇండొనేషియాలోని పపువా ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవలే సుగితో (48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి, ప్రమాదవశాత్తు ఎన్ క్లోజర్ లో పడిపోయాడు. అందులో ఉన్న ఓ మొసలి అతన్ని చంపేసింది. అదే రోజు స్థానికులు అతనికి అంత్యక్రియలను నిర్వహించారు.

అనంతరం సుగితో కుటుంబం సహా గ్రామస్తులంతా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య ఎన్ క్లోజర్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్ క్లోజర్ సిబ్బంది చెప్పినప్పటికీ వారు ఒప్పుకోలేదు. అంతేకాదు, కత్తులు, కట్టెలు పట్టుకుని ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లారు. ఒక్కక్క మొసలిని బయటకు లాగి, మొత్తం 300 మొసళ్లను చంపేశారు. గ్రామస్తులు చంపిన మొసళ్లలో నాలుగు అంగుళాల పొడవు ఉన్న చిన్నిచిన్ని మొసళ్లతో పాటు, రెండు మీటర్ల పొడవున్న పెద్ద మొసళ్లు కూడా ఉన్నాయి. 

More Telugu News