software engineer: నా భార్య, అత్తింటివారు నన్ను టార్చర్ పెడుతున్నారు: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదు

  • రూ. 30 లక్షల ఆభరణాలు కొనివ్వాలంటూ భార్య డిమాండ్
  • రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ అత్తామామల వేధింపులు
  • బెంగుళూరులో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు టార్చర్

రూ. 30 లక్షల విలువగల వజ్రాభరణాలు కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తన భార్య తనను బెదిరిస్తోందంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ధీరజ్ రెడ్డి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. 2014లో జయశ్రుతి అనే యువతిని పెళ్లాడాడు. కొన్నాళ్లు సజావుగా కాపురం సాగాక... తన భార్య నుంచి వేధింపులు మొదలయ్యాయి.

అంతేకాదు, రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ అత్తింటివారు డిమాండ్ చేస్తున్నారని ధీరజ్ వాపోయాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే... అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు కేసు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. తన భార్య సిగరెట్లు, మందు తాగుతుందని... ఈ విషయంపై అత్తామామలకు ఫిర్యాదు చేయగా... వారు ఆమెకే మద్దతు పలుకుతున్నారని... తమ కూతురు చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నారని తెలిపాడు. వీరి టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, జయశ్రుతితో పాటు ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. 

More Telugu News