ఈ సారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా!: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్
Add ap7am to your home Screen

ఈ సారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా!: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్

  • లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
  • అది నా నిర్ణయం మాత్రమే
  • పార్టీ నిర్ణయానికి విధేయుడినై ఉంటా
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నదీ టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, అంతిమ నిర్ణయం మాత్రం అధిష్ఠానానికే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. మద్దతుదారులు, శ్రేయాభిలాషులు తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.

తన నిర్ణయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశానని చెప్పిన అజర్.. తాను కెప్టెన్‌ను కాదన్నారు. తానే కనుక ఇక్కడ కెప్టెన్‌ను అయి ఉంటే మాత్రం సికింద్రాబాద్‌నే ఎంచుకునే వాడినన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. అయితే, పాతబస్తీ నుంచి మాత్రం పోటీ చేసే యోచన లేదని అజర్ తేల్చి చెప్పారు.
Azaharuddin
secunderabad
Lok Sabha
Congress

More Telugu News