Nawaz Sharif': ఆ సౌకర్యాలు నాకేమీ అక్కర్లేదు.. జైలు అధికారులకు తేల్చి చెప్పిన నవాజ్ కుమార్తె మరియం

  • అడియాలా జైలులో మరియం నవాజ్
  • అదనపు సౌకర్యాలకు ముందుకొచ్చిన అధికారులు
  • సున్నితంగా తిరస్కరించిన మాజీ ప్రధాని కుమార్తె

అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌ మెరుగైన సౌకర్యాలకు నో చెప్పారు. నిబంధనల ప్రకారం తనకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెప్పారని, అయితే తాను తిరస్కరించానని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్రయంలో నవాజ్, మరియంలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రావాల్పిండిలోని అడియాలా జైలుకు తరలించారు.

పాక్ నిబంధల ప్రకారం.. సామాజిక హోదా కలిగిన వ్యక్తులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి జైలులో క్లాస్ -బి సౌకర్యాలు కల్పిస్తారు. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ వంటి వాటిని సమకూరుస్తారు. అయితే, అందుకు అవసరమైన ఖర్చును వారే భరించాల్సి ఉంటుంది. జైలుకొచ్చిన మరియంకు అధికారులు ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు.

అయితే, ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. జైలు సూపరింటెండెంట్ తనకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందుకొచ్చారని, అయితే, తాను ఇష్టపూర్వకంగా వద్దని చెప్పానని తెలిపారు. ఈ విషయంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

More Telugu News