ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతుంటే... యువతికి ప్రపోజ్... వైరల్ అవుతున్న వీడియో!
- మ్యాచ్ మధ్యలో ప్రపోజ్
- వెంటనే అంగీకరించిన అమ్మాయి
- గత సంవత్సరం ఇదే మైదానంలో ఇద్దరు కలిశారన్న లార్డ్స్ సిబ్బంది
తనకు నచ్చిన అమ్మాయికి ఓ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే, అమ్మాయి సిగ్గుతోనే అంగీకరించింది. చుట్టూ ఉన్నవారు చప్పట్లతో తమ హర్షాతిరేకాన్ని, అభినందనలను తెలిపారు. లార్డ్స్ మైదానంలో తొలి లవ్ ప్రపోజల్ అని చెబుతూ, ఈ వీడియోను కలికా అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియాలో పంచుకోగా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సైతం స్పందించింది. గత సంవత్సరం కూడా ఓ జంట ఇదే మైదానంలో ఒకటైందని, ప్రేమ ఎప్పుడూ ఉంటుందని చెప్పింది. ఈ వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.