కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ!: ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ
- కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
- ముస్లిం మహిళల బాధ ఆ పార్టీకి పట్టదని వ్యాఖ్య
- తలాక్ వల్ల మహిళలకు ఇక ఇబ్బంది ఉండదని భరోసా
ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము ప్రయత్నిస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం వారిని తిరిగి చీకట్లోకి నెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇకపై ట్రిపుల్ తలాక్ వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు అన్నట్టు తాను పేపర్లో చదివానని మోదీ పేర్కొన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహజ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని అన్నారని, ఈ సందర్భంగా తాను ఓ ప్రశ్న అడగనున్నానని, కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల కోసమేనా? అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను కాంగ్రెస్ గౌరవించదా? అని ప్రధాని నిలదీశారు.