ashok galla: మహేశ్ బాబు మేనల్లుడి సినిమాకి కొత్త దర్శకుడు!

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో మహేశ్ బాబుకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అందువలన ఆయన ఫ్యామిలీ వైపు నుంచి ఎవరు హీరోగా వస్తున్నారన్నా అభిమానుల్లో ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ను హీరోగా తెలుగు తెరకి పరిచయం చేయడానికి కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు .. దర్శకుడిగా మొదట్లో కృష్ణారెడ్డి గంగదాసును ఎంపిక చేశారు. 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమాకి దర్శకత్వం వహించిన కృష్ణారెడ్డి .. కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపైనే వర్క్ చేస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆ దర్శకుడిని పక్కన పెట్టేసి .. శశి అనే కొత్త దర్శకుడికి ప్రాజెక్టును అప్పగించినట్టుగా సమాచారం. ఒక టర్కీ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.    
Go Back to Shorts
ashok galla
dil raju

More Telugu News