Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గెస్ట్ పాత్ర పోషించనున్న సమంత?
  • 'బ్రహ్మాస్త్ర' కోసం యూరప్ వెళ్లిన నాగార్జున
  • ఠాగూర్ మధు చేతిలో 'పందెంకోడి 2'
  • ఈ నెలలోనే దుల్ఖర్ 'జనతా హోటల్'

 *  శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'గూఢచారి' చిత్రంలో అందాలతార సమంత గెస్ట్ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. త్వరలో ఆమె పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది.
*  దాదాపు పదిహేనేళ్ల తర్వాత అక్కినేని నాగార్జున 'బ్రహ్మాస్త్ర' అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆయన నిన్న యూరప్ బయలుదేరి వెళ్లారు. ఈ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, నాగ్, రణబీర్ కపూర్, అలియా భట్ లపై అక్కడ షూటింగ్ చేస్తారు.
*  విశాల్, కీర్తి సురేశ్ జంటగా 'పందెంకోడి 2' చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తారు.
*  దుల్ఖర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన 'ఉస్తాద్ హోటల్' మలయాళ చిత్రాన్ని 'జనతా హోటల్' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత సురేశ్ కొండేటి తెలిపారు.
 

  • Loading...

More Telugu News