imrankhan: ఇమ్రాన్ కు అక్రమ సంతానం ఉంది.. అందులో భారతీయులూ ఉన్నారు: మాజీ భార్య రెహమ్ ఖాన్

  • ఇమ్రాన్ ఖాన్ కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారు
  • ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రాన్ నాకు చెప్పారు
  • రెహమ్ ఖాన్ ఆత్మకథ ‘టెల్ ఆల్’లో వివాదాస్పద వ్యాఖ్యలు

తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ తన ఆత్మకథను ‘టెల్ ఆల్’ పేరిట రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో పలు వివాదాస్పద విషయాలను ఆమె ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయాన్ని ఇమ్రాన్ గతంలో తనకు చెప్పారని, ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్ స్మిత్ కు కూడా ఈ సంగతి తెలుసని అన్నారు. ఇమ్రాన్ కు, సితా వైట్ కు జన్మించిన టైరియన్ వైట్ గురించి గతంలో తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన సమయంలో, టైరియన్ వైట్ ఒక్కతే కాదని, తనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంత మంది భారతీయులు కూడా ఉన్నారని చెప్పారని, ఇమ్రాన్ సంతానంలో పెద్ద వ్యక్తి వయసు 34 ఏళ్లని ఆ పుస్తకంలో ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇమ్రాన్ కు ప్రధాని కావాలనే కోరిక ఉండేదని, ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని ఈ పుస్తకంలో ఆమె ప్రస్తావించారు.

More Telugu News