sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. ఆల్ టైమ్ హైలో ముగిసిన సెన్సెక్స్

  • అంతర్జాతీయ సానుకూలతలతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 36,548కి పెరిగిన సెన్సెక్స్
  • 11వేల మైలురాయిని అధిగమించిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ముగిసింది. నిఫ్టీ 11 వేల మైలురాయిని దాటింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 282 పాయింట్లు పెరిగి 36,548కి ఎగబాకింది. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 11,023 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (8.00%), జీఎంఆర్ ఇన్ ఫ్రా (5.59%), కర్ణాటక బ్యాంక్ (4.81%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (4.70%), బజాజ్ ఎలక్ట్రికల్స్ (4.66%).

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-5.74%), అదానీ పవర్ (-5.64%), డెల్టా కార్ప్ (-5.44%), క్వాలిటీ (-5.00%), వక్రాంగీ (-4.81%).     

More Telugu News