murder: ఆషాఢ మాసంలో ఎందుకొచ్చావంటూ అల్లుడిని హత్య చేసిన మామకు జీవిత ఖైదు!

షార్ట్స్‌లో చూడండి
ఆషాఢ మాసంలో ఇంటికి ఎందుకొచ్చావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్లుడిని హత్య చేసిన ఓ మామకు అమలాపురం రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సంతమార్కెట్లో 2015 జులై 8న ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్.అక్కిరాజు కూతురు దుర్గాభవానికి అమలదాసు సత్తిబాబు అనే యువకుడితో 2015లో పెళ్లి జరిగింది.

అయితే, దుర్గాభవాని పుట్టింటికి సత్తిబాబు పదే పదే వస్తున్నాడు. ఇలా ఆషాఢ మాసంలో అత్తగారింటికి రావద్దని ఆయనను మామ అక్కిరాజు హెచ్చరించాడు. అయినా వినిపించుకోకుండా వచ్చిన అల్లుడు సత్తిబాబుని అక్కిరాజు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య దుర్గాభవాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనంతరం విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. అక్కిరాజుకి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Go Back to Shorts
murder
East Godavari District

More Telugu News