దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి యాక్షన్ థ్రిల్లర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి యాక్షన్ థ్రిల్లర్

  • తెలుగు తెరపై మల్టీ స్టారర్స్ జోరు 
  • ఈ తరహా కథలపై దర్శక నిర్మాతల ఉత్సాహం 
  • ఆ దిశగా వెళుతోన్న ఇంద్రగంటి    
తెలుగు తెరపై ఒక వైపున బయోపిక్ ల హవా కొనసాగుతోంటే .. మరో వైపున మల్టీస్టారర్ మూవీస్ జోరు పెరుగుతోంది. నాగార్జున - నాని కాంబినేషన్ లో 'దేవదాస్' .. వెంకటేశ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 2' .. వెంకటేశ్ - చైతూ కాంబినేషన్లో 'వెంకీమామ' సినిమాలు రూపొందుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని కాంబినేషన్స్ ను సెట్ చేసే పనిలో దర్శక నిర్మాతలు వున్నారు.

అలా దిల్ రాజు .. ఇంద్రగంటి మోహనకృష్ణ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగనుందని సమాచారం. త్వరలోనే నాయకా నాయికలను .. ఇతర నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి ఎనౌన్స్ చేయనున్నారు. 'సమ్మోహనం' సక్సెస్ తరువాత ఇంద్రగంటి ప్లాన్ చేసిన సినిమా కావడం వలన, సహజంగానే అంచనాలు పెరిగే అవకాశాలు వున్నాయి.   
dil raju
indraganti

More Telugu News