జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధమే: ఎంపీ కవిత
- జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశాలు
- తెలంగాణకు గురువు కేసీఆర్
- ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారు
ఈ సందర్భంగా ఆమెకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటైన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చాం కనుకనే ప్రజలు టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చారని అన్నారు. తెలంగాణకు గురువు కేసీఆర్ అని, ప్రాణాలను సైతం ఆయన పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.