MS Dhoni: 300 మ్యాచ్ లాడిన నేను పిచ్చోడినా?: కుల్ దీప్ యాదవ్ కు క్లాస్ పీకిన ధోనీ!

  • గత సంవత్సరం డిసెంబరులో ఘటన
  • ఫీల్డింగ్ మార్పులు అవసరం లేదన్న కుల్ దీప్
  • ఆగ్రహించిన మహేంద్ర సింగ్ ధోనీ
ఒత్తిడిలోనూ ప్రశాంతత, చిరునవ్వు చెక్కుచెదరకుండా కనిపించే మహేంద్ర సింగ్ ధోనీకి మైదానంలో కోపం తెప్పించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కుల్ దీప్ యాదవ్. ఈ విషయాన్ని కుల్ దీప్ స్వయంగా చెప్పాడు. ఈ ఘటన గత సంవత్సరం చివర్లో ఇండోర్ లో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ లో జరిగిందట. ఇంతకీ ధోనీకి కోపం తెప్పించిన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 260 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆపై లంక విజయం దిశగా సాగుతోంది.

ఆ సమయంలో కుల్ దీప్ కు ఫీల్డింగ్ మార్చమని సలహా ఇచ్చిన ధోనీ, కవర్స్ లో ఉన్న ఫీల్డర్ ను పాయింట్ లోకి రావాలని చెప్పగా, ఆ అవసరం లేదని కుల్ దీప్ చెప్పాడట. దీంతో ఆగ్రహించిన ధోనీ, "300 మ్యాచ్ లను ఆడిన నేను పిచ్చోడిని అనుకుంటున్నావా?" అన్నాడట. దీంతో కుల్ దీప్ వెంటనే ఫీల్డర్ ను మార్చాడు. ఆపై వికెట్ కూడా దక్కింది. ఈ ఘటన తరువాతనే తనకు ధోనీకి ఉన్న అనుభవమేంటో తెలిసివచ్చిందని, వికెట్ పడిన తరువాత ధోనీ తన వద్దకు వచ్చి, "ఇదే నేను చెప్పింది" అంటూ భుజం తట్టాడని తెలిపాడు.
MS Dhoni
Kuldeep Yadav
India
Cricket
Angry

More Telugu News