Kurnool District: ఏపీ మంత్రి నారా లోకేష్ కు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ నేతలు!

  • కర్నూలు ఎంపీ, అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ప్రకటించిన లోకేష్
  • వారిద్దరి ఓటమి ఖాయమన్న బీవై రామయ్య
  • ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారని వ్యాఖ్య
ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ పార్లమెంటరీ, ఓ అసెంబ్లీ సీటు వచ్చేలా చేసిన మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య వ్యాఖ్యానించారు. కర్నూలు ఎంపీ సీటుకు బుట్టా రేణుకను, ఎమ్మెల్యే సీటుకు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులతో కలసి మీడియాతో మాట్లాడిన రామయ్య, తమ పార్టీ టికెట్ పై గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వారికి టికెట్లను ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీ ఉందని వ్యాఖ్యానించారు. వారంతా ప్రజా గ్రహాన్ని ఎదుర్కోనున్న వాళ్లేనని విమర్శించారు. లోకేష్ పర్యటనలతో ప్రజల్లో అయోమయం నెలకొని వుందని, తన శాఖ గురించి కాకుండా, పక్క శాఖల పనుల్లో పెత్తనాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Kurnool District
Nara Lokesh
BY Ramaiah
Telugudesam
YSRCP

More Telugu News