Pakistan: పాక్‌ నుంచి వెళ్లకుండా నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కూతురిపై చర్యలు!

  • అవినీతికి పాల్పడ్డ కేసులో నవాజ్ షరీఫ్‌కి జైలు శిక్ష విధించిన కోర్టు
  • ప్రస్తుతం లండన్‌లో నవాజ్‌ షరీఫ్‌
  • విదేశాలకు వెళ్లకుండా నిషేధం

అవినీతికి పాల్పడ్డ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె, అల్లుడుకి న్యాయస్థానం జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం పేర్లను పాక్‌ ప్రభుత్వం నిషేధిత జాబితా(ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్)లో చేర్చడంతో ఆయనకు మరిన్ని కష్టాలు వచ్చాయి.

వారిద్దరినీ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. షరీఫ్ భార్య బేగం కుల్సూమ్ నవాజ్  గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో ప్రస్తుతం సదరు తండ్రీకూతుళ్లు లండన్‌లోనే ఉన్నారు. త్వరలోనే వారు పాక్‌ వెళ్లే అవకాశం ఉంది. తమ దేశానికి తిరిగి వచ్చాక మళ్లీ వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు.    

More Telugu News