priya prakash: ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు మరో భారీ ఆఫర్‌

  • వాణిజ్య ప్రకటన కోసం రూ.కోటి డీల్‌
  • బయటకు వచ్చిన పలు ఫొటోలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒక్కో యాడ్‌కి రూ.8 లక్షలు
మలయాళ సినిమా ‘ఒరు అదార్‌ లవ్‌’లోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు ప్రస్తుతం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఓ వాణిజ్య ప్రకటన కోసం రూ.కోటి డీల్‌కు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఆ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్లు ఆరు మిలియన్లకు పైగా పెరిగిపోవడంతో దాని ద్వారా కూడా ఆమె బాగా సంపాదిస్తోంది. అందులో ఆమె ఇచ్చే ఒక్కో ప్రకటనకు రూ.8 లక్షలు తీసుకుంటోంది. ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. 
priya prakash
Kerala

More Telugu News