mothkpalli: రేపు తిరుమలకు మోత్కుపల్లి.. అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి

  • ఈరోజు తిరుపతి వెళతా
  • రేపు ఉదయం తిరుమల కొండపైకి కాలినడకన వెళతా
  • చంద్రబాబును వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావాలి
టీ-టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు రేపు తిరుమలకు వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, ఈరోజు తిరుపతి వెళతానని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి, శ్రీవారి దర్శనం చేసుకుంటానని చెప్పారు.

 దిక్కులేని వాడికి దేవుడే దిక్కని, తాను పడ్డ మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తన 64వ జన్మదినోత్సవం రోజున తిరుమల వెళ్తున్నానని అన్నారు. రేపు ఉదయం అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం, కొండపైకి నడుచుకుంటూ బయలుదేరతానని చెప్పారు. 12వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దళితులు, బలహీనవర్గాల వారు చంద్రబాబు మాటలు నమ్మి మోస పోవద్దని, చంద్రబాబును వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
mothkpalli
Tirumala

More Telugu News