Mukesh Ambani: ఇంకా ప్రారంభమేకాని జియో ఇనిస్టిట్యూట్ కు శ్రేష్ఠతర హోదా... మోదీ సర్కారు తీరుపై విమర్శల వెల్లువ!

  • బిట్స్ పిలానీ, మణిపూర్ వర్శిటీల సరసన జియో
  • మొదలే కాని విద్యాసంస్థకు ఉన్నత హోదా ఎలా?
  • ముఖేష్ అంబానీకి అనుకూలంగా ఎన్డీయే సర్కారు
  • కాంగ్రెస్ విమర్శ

దేశంలోని ఆరు శ్రేష్ఠతర విద్యాసంస్థలను ప్రకటించిన కేంద్రం, అందులో ఇంకా ప్రారంభమే కాని రిలయన్స్ ఫౌండేషన్ తలపెట్టిన జియో ఇనిస్టిట్యూట్ పేరును చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హోదా కోసం ఎంపికైన ఆరు విద్యా సంస్థల వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. వీటిల్లో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. మూడు ప్రైవేటు సంస్థల్లో బిట్స్ పిలానీ, మణిపాల్ యూనివర్శిటీలతో పాటు జియో ఇనిస్టిట్యూట్ చోటు దక్కించుకుంది. ఇంకా ప్రారంభం కాని విద్యా సంస్థ, ఉన్నత స్థాయిలో ఎలా ఉంటుందని కేంద్రంపై పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడుతున్నారు. దీంతో మోదీ సర్కారు మరోసారి సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లయింది.

దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ, రిలయన్స్ ఫౌండేషన్ కు కేంద్రం అనుకూలంగా ఉందని తేలిపోయిందని, ముఖేష్ అంబానీ, నీతాలకు అనుకూలంగా ఎన్డీయే సర్కారు నడుస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించింది. ఏ ప్రమాణాలను ఆధారంగా తీసుకుని ఈ హోదాను ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, దీనిపై యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ - విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) స్పందిస్తూ, గ్రీన్ ఫీల్డ్ కేటగిరీలో 11 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకోగా, జియోను ఎంపిక చేసినట్టు వెల్లడించింది.

More Telugu News