mumbai: భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం.. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు

  • రికార్డు స్థాయిలో 165.8 మి.మీ వర్షం
  • రానున్న 24 గంటల్లో మరో 150 మి.మీ వర్షపాతం
  • ముంబై యూనివర్శిటీలో అన్ని పరీక్షలు రద్దు
భారీ వర్షాల దెబ్బకు ముంబై మహానగరం అతలాకుతలమైంది. నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సుమారుగా 165.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో మరో 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైటెమ్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ముంబై యూనివర్శిటీలోని అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. రైల్వే పలు సర్వీసులను రద్దు చేసింది. లోకల్ ట్రైన్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ముంబై సముద్రతీరాన్ని భారీ అలలు ఢీకొంటున్నాయి. 
mumbai
rains

More Telugu News