Jagapati Babu: ఇంతకన్నా నీచుడైన విలన్ మరొకరు ఉండడు: జగపతి బాబు

  • 'లెజండ్' నుంచి రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన జగపతి బాబు
  • 'సాక్ష్యం' చిత్రంలో విలన్ పాత్రలో నటించిన జగపతి బాబు
  • తాను పోషిస్తున్న అత్యంత క్రూరమైన పాత్ర ఇదేనని వెల్లడి
బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజండ్' నుంచి తన సినీ కెరీర్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన జగపతి బాబు, ఆపై పలు చిత్రాల్లో క్రూరమైన విలన్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రంలోనూ విలన్ గా కనిపించిన జగపతి బాబు, ఆ పాత్ర గురించి ప్రశ్నించినప్పుడు, ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.

ఈ సినిమాలో అత్యంత క్రూరుడైన విలన్ పాత్రలో నటించానని చెప్పారు. ఈ ప్రపంచంలో ఇంతకన్నా నీచుడైన విలన్ మరొకరు ఉండరని, ఇప్పటివరకూ తాను పోషించిన విలన్ పాత్రలను క్షమించిన తెలుగు సినీ ప్రేక్షకులు, వీడిని మాత్రం క్షమించరని అన్నారు. చాలా పెద్ద వెధవని, డబ్బు తప్ప మరో విషయం గురించి ఆలోచించడని తెలిపారు.
Jagapati Babu
Legend
Villan
Sakshyam

More Telugu News