ttd: ముఖ గుర్తింపు కెమెరాలపై వెనకడుగు వేసిన టీటీడీ!

  • పాత నేరస్తులను గుర్తించి, పోలీసులను అలర్ట్ చేసే కెమెరాలు
  • నేరస్తుల పోలికలకు దగ్గరగా ఉన్నవారిని కూడా గుర్తిస్తాయి
  • సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశం

తిరుమలలో నేరస్తులను కట్టడి చేసేందుకు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) కెమెరాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ అధికారులు విరమించుకున్నారు. అలిపిరిలో వీటిని ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలోనే పాత నేరస్తులను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చేలా ఈ కెమెరాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే, పాత నేరస్తుడి పోలికలకు కాస్త దగ్గరగా ఉన్నవారిని కూడా కెమెరాలు గుర్తించి, పోలీసులను అలర్ట్ చేస్తాయి. దీంతో, అమాయకులను కూడా అదుపులోకి తీసుకుని, విచారించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది తరలి వచ్చే ఈ క్షేత్రంలో ఇలాంటి వ్యవస్థ సరి కాదని అధికారులు భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

More Telugu News