మరోమారు రికార్డులకెక్కిన రోహిత్ శర్మ!
- టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి ఇండియన్
- 56 బంతుల్లో అజేయ సెంచరీ
- వరుస వైఫల్యాల తర్వాత రెచ్చిపోతున్న స్టార్ ఆటగాడు
బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ వీర విజృంభణ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే వంద పరుగులు పిండుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్‌గా రోహిత్ ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్. న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మన్రో కూడా టీ20ల్లో మూడు సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.