చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి వుంది: కల్యాణ్ దేవ్
- స్కూల్ డేస్ లో డాన్సులు చేసేవాడిని
- కాలేజ్ రోజుల్లో డ్రామాలు వేశాను
- డైరెక్టర్ ఎంతో ప్రోత్సహించాడు
టీచర్స్ .. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ వుండేవాళ్లు .. ఏదో ఒక ప్రైజ్ తెచ్చుకుంటూ ఉండేవాడిని. అలా కాలేజ్ డేస్ లోను డ్రామాలు వేసేవాడిని. ఇక నటనలో పూర్తిస్థాయి మెళకువలు నేర్చుకోవడం కోసం సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఆయన నుంచి నటనకి సంబంధించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక మా డైరెక్టర్ ఆశించిన అవుట్ పుట్ ను ఇవ్వగలుగుతున్నానా .. లేదా అనే డౌట్ ఉంటూ వుండేది. 'చాలా బాగా చేశావ్ .. ' అంటూ ఎప్పటికప్పుడు ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఉండటం వలన ఈ సినిమాను చేయగలిగాను" అంటూ చెప్పుకొచ్చాడు.