విజయ్ మాల్యాకు దిమ్మదిరిగే షాకిచ్చిన లండన్ కోర్టు.. భారత బ్యాంకులకు గొప్ప విజయం!
- మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చన్న కోర్టు
- ఆయన భవనాలు, ఆస్తులపై నియంత్రణకు బ్యాంకులకు అధికారం
- అవసరమైతే పోలీస్ ఫోర్సు ఉపయోగించుకోవచ్చని సూచన
ఈ ఆదేశాలను ఉపయోగించుకుని 1.145 బిలియన్ పౌండ్ల విలువైన నిధులను రికర్ చేసుకోవాలని బ్యాంకులకు తెలిపింది. ‘‘హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఎవరైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్ నేతృత్వంలో విజయ్ మాల్యా భవంతుల్లోకి ప్రవేశించవచ్చు. ఆయన ఆస్తులను తమ నియంత్రణలోకి తీసుకోవచ్చు’’ అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అవసరమైతే పోలీసు ఫోర్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే, పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
లండన్ కోర్టు తీర్పు తమకు గొప్ప విజయమని బ్యాంకుల కన్సార్టియం పేర్కొంది. భారత్‌లోని 13 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర ఎగ్గొట్టిన విజయ్ మాల్యా మార్చి 2, 2016లో లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.