parakala: మంత్రి పదవి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోయదొరలతో పూజలు చేయిస్తున్నారు: బీజేపీ

  • నియోజకవర్గంలో జరుగుతున్న కాంట్రాక్టులన్నీ ధర్మారెడ్డివే
  • పాలనను గాలికి వదిలేశారు
  • వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు
పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పదవి కోసం ఆయన కోయదొరలతో పూజలు చేయిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాంట్రాక్టులు, కమీషన్లకే పరిమితమయ్యారని... పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కాంట్రాక్టు ధర్మారెడ్డిదే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ధర్మారెడ్డికి డిపాజిట్ కూడా రాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తోందని చెప్పారు. బీజేపీ జనచైతన్య యాత్రలో భాగంగా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
parakala
dharmareddy
koyadora
bjp

More Telugu News