BJP: ఏపీలో బీజేపీని బతికించడం కోసమే ఆ రెండు పార్టీలు కలుస్తాయి: సబ్బం హరి

  • ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు
  • ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగాక ఏపీలో బీజేపీకి వ్యతిరేకతొచ్చింది
  • చంద్రబాబు వాదనను ప్రజలందరూ అంగీకరించారు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ‘ఏబీఎన్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం. టీడీపీ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు.

‘పవన్ కల్యాణ్ గారు మా పార్టీకి మద్దతిస్తానని నాకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి పవన్ కలిసి పనిచేస్తారు’ అని వైసీపీ తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ గారు ఈ మధ్య ఓ ప్రకటన చేశారు కదా!’ అన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ఏపీలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు వాదనను ప్రజలందరూ అంగీకరించారని చెప్పారు. అదే సమయంలో, బీజేపీని, మోదీని.. వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించకపోవడాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.
BJP
YSRCP
jena sena
sabbam hari

More Telugu News